వీపనగండ్ల: వీపనగండ్ల ఆరోగ్య కేంద్రాన్ని అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు వీపనగండ్ల మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఓపి రిజిస్టర్, డెలివరీలకు సంబంధించిన రిజిస్టర్, మందుల రిజిస్టర్ లను తనిఖీ చేశారు.