సంతనూతలపాడు లో ఎంపీడీవో కార్యాలయం వద్ద నుండి పోలీస్ స్టేషన్ వరకు రూ.1.45 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించునున్న సిసి రోడ్డుకు సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్ విజయ్ కుమార్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సంతనూతలపాడు లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంతనూతలపాడులో అభివృద్ధి పనులను వేగవంతం చేశామన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.