బనగానపల్లె: బనగానపల్లె మండలంలో ప్రయాణికుడి పై బస్సు డ్రైవర్ దాడి
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం వద్ద శేషు కృష్ణ అని ప్రయాణికులపై గురువారం ఆర్టీసీ డ్రైవర్ బాలయ్య చేతికడియంతో దాడి చేశాడు. దీంతో ప్రయాణికుడికి రక్త గాయాలయ్యాయి గ్రామంలోని హైస్కూల్ బస్టాప్ వద్ద ప్రయాణికులు ఎక్కుతుండగా బస్సు డ్రైవర్ ముందుకు కదిలించాడు ఆపాలంటూ బస్సు చేతితో కొట్టుకుంటూ శేషు కృష్ణ బస్సును వెంబడించాడు. బస్సును కొట్టడంపై ఆగ్రహం చెందిన బస్సు డ్రైవర్ బాలయ్య బస్సు ఆపి చితకబాదాడు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు శేషు కృష్ణకు మద్దతుగా నిలిచారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు