రాబోవు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వివిధ రాజకీయ పక్షాలు సహకారం అందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి రంజిత్ భాషా కోరారు. బుధవారం కలెక్టరేట్ లోని వారి ఛాంబర్ లో వివిధ రాజకీయ పక్షాలతో జిల్లా కలెక్టర్ సమావేశమై, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు సంపూర్ణ అవగాహన కలిగించేందుకు వర్క్ షాప్ నిర్వహించారు.