పలమనేరు: కాల్వపల్లి రిజర్వాయర్ కు జలకళ, సందర్శించి గంగా హారతి చేపట్టిన కమీషనర్, ప్రజలకు నీటి కొరత తీరినట్లే అన్నారు
పలమనేరు: పురపాలక సంఘం పరిధిలో గల కాల్వపల్లె రిజర్వాయర్ ను కమీషనర్ రమణా రెడ్డి సందర్శించారు. రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండడంతో కాల్వ పల్లి ప్రజలతో కలిసి గంగా హరతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ, కాల్వపల్లి రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండడంతో పట్టణ ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది కలగదన్నారు. రిజర్వాయర్ ఫిల్టర్లు బెడ్స్ మరియు మోటార్లను అవసరమైన మర్మత్తులను చేసి పట్టణ ప్రజలకు మరింత మెరుగైన నీటి సౌకర్యాన్ని కల్పించుటకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.