వాజేడు: నీరు లేక వెలవెలబోతున్న బోగతా జలపాతం - పర్యాటకుల నిరాశ
Wazeedu, Mulugu | Oct 19, 2026 ములుగు జిల్లాలోని బోగతా జలపాతం నీటి ప్రవాహం తగ్గి వెలవెలబోతోంది. సన్నని ధారలతో జలపాతం కళతప్పడంతో సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పర్యాటకులు సమీపంలోని స్విమ్మింగ్ పూల్‌ను ఆశ్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రవాహం మరింత తగ్గే సూచనలు ఉన్నాయి.