బనగానపల్లె: నందవరంలో కళ్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరంలోని చౌడేశ్వరి దేవస్థానంలో నూతన కళ్యాణ మండప నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో బీసీ ఇందిరా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఛైర్మన్ సేతు రామ నాగార్జున రెడ్డి, దేవస్థాన అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పాణ్యం వెంకట కుమార్ రెడ్డితో కలిసి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.