ఒంగోలు అర్బన్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ స్వామి
Ongole Urban, Prakasam | Jul 4, 2026
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చెప్పారు.సీతారామరాజు స్వగృహాన్ని తాను గత ఏడాది సందర్శించానని చెప్పారు. దానిని వారసత్వ స్మారక స్థూపంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయానికి కూడా సీతారామరాజు పేరు ప్రభుత్వం పెట్టిందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ధైర్యంగా ముందుకుసాగిన అల్లూరి జీవితం, పోరాట స్ఫూర్తి భావితరాలకు తెలియచేయాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు.