కర్నూలు: కర్నూలు జిల్లాలో ఉల్లి రైతు ఆత్మహత్య.. ఉల్లికి గిట్టుబాటు ధర లేక పురుగుల మందు తాగి రైతు మృతి
కర్నూలు జిల్లాలో ఉల్లి రైతు ఆత్మహత్య.. ఉల్లికి గిట్టుబాటు ధర లేక పురుగుల మందు రైతు మృతి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కొసనపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మూడున్నర ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేసిన రైతు రామచంద్రుడు (39) అప్పుల బారినపడి సోమవారం పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యుల ప్రయత్నాలు ఫలించక మృతి చెందాడు.భార్య లక్ష్మీదేవి కన్నీటి పర్యంతమై మీడియాతో మాట్లాడుతూ… గతంలో మిరప పంట నష్టపోవడంతో ఈ సీజన్లో ఉల్లిని సాగు చేశామని తెలిపారు. “ఉల్లి పంట బాగా పండింది. కానీ మార్కెట్లో ధర లేకపోవడంతో తీ