కర్నూలు: రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందిన 13 గంటల పని దినాన్ని వెంటనే రద్దు చేయాలని : సిఐటియూ నగర అధ్యక్షుడు నాగేష్ డిమాండ్
రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందిన 13 గంటల పని విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నగర అధ్యక్షుడు నగేష్, కార్యదర్శి నరసింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడుతూ...కార్మికులు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది 8గంటల పని విధానం 13గంటలకు పెంచడానికేనా? మహిళా కార్మికులను రాత్రిపూట డ్యూటీ చేయించేందుకేనా? అని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు యజమానులకు బలిచేస్తున్నారని విమర్శించారు.ప్రజలు ఎంచుకున్న ఎమ్మెల్యేలు కష్టజీవులను కార్పొరేట్, ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడానికేనా అని ఆవేదన వ్యక్తం చేశారు. 13గంటల పని, వార