కర్నూలు: మైనారిటీలు పడుతున్న బాధలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం: వైకాపా కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
మైనారిటీలు పడుతున్న బాధలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. బుధవారం ఉదయం 12 గంటలు వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మైనారిటీల వేధింపులకు కేంద్రంలో ఎన్డీఏ, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వాలు కారణమన్నారు. వక్స్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టును ఆశ్రయించామని, అండగా నిలిచిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటానికి ముస్లిం సమాజం ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.