రాయచోటిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శివశంకర్ తెలిపారు.ఈ జాబ్ మేళాలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు పాల్గొనే అర్హత ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.in వెబ్సైట్లో ఆధార్ OTPతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్న వారు తమ ప్రొఫైల్‌తో లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని, దానితో ఇంటర్వ్యూకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ తెలిపారు.