ఒంగోలు అర్బన్: మీకోసం సమయ వేళల్లో మార్పులు గమనించాలని ప్రజలకు తెలియజేసిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 13, 2026
ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి సంబంధించిన సమయాన్ని మారుస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శనివారం మీడియా సమావేశంలో తెలియజేశారు ఎండలు తగ్గుముఖం పట్టినందున ఎప్పటిలాగే ఉదయం 10 గంటలకు మీకోసం కార్యక్రమం ప్రారంభమవుతుందని దీనిని ప్రజలు గుర్తించాలన్నారు దృష్ట్యా ఇప్పటివరకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని జూన్ 15వ తేదీ నుంచి గతంలో మాదిరిగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కార్యక్రమం ఉంటుందని తెలిపారు దూరప్రాంతాల వారు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు