బనగానపల్లె: కోవెలకుంట్లలో ఆపరేషన్" వజ్ర ప్రహార్ "
మాదక ద్రవ్యాల రహిత సమాజం లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున కోవెలకుంట్ల మండలం కంపమల్లలో 'వజ్ర ప్రహార్' కార్యక్రమం నిర్వహించినట్లు సీఐ హనుమంతు నాయక్ తెలిపారు. మండలంలో అనుమానిత ప్రాంతాలలో పోలీసు బృందాలతో సోదాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రతీ ఇంటిని, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు. కోవెలకుంట్ల ఎస్సై మల్లికార్జున్ రెడ్డి, సంజామల ఎస్సై రమణయ్య పాల్గొన్నారు.