సిర్పూర్ టి: ఎర్రవాగు సమీపంలోని తంగళ్ళపల్లి, చిన్న తిమ్మాపూర్ పంట పొలాలలో పులి సంచారం భయంతో వలన చెందుతున్న ప్రజలు
దాహేగం మండలంలో పెద్దపులి సంచారం కలకాలం రేపుతుంది. ఎర్రవాగు సమీపంలోని తంగళ్ళపల్లి చిన్న తిమ్మాపూర్ గ్రామాల పంట పొలాల్లో పులి అడుగులను గ్రామస్తులు బుధవారం గుర్తించారు. పులి సంచరించడంతో వివిధ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులి సంచారం వాస్తవమేనని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు,