సికింద్రాబాద్ బ్లూసీ హోటల్ సమీపంలో గంజాయి వినియోగిస్తున్నారనే సమాచారం మేరకు STF B టీం SI బాలరాజు తన సిబ్బందితో కలిసి రైడ్స్ చేసి 252 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిపై కేసు నమోదు చేశారు. గౌస్ పాషా పరారీలో ఉండగా బినేశ్, పవన్, నార్సర్ను అరెస్టు చేశారు. వీరి వద్ద ఉన్న 4 మొబైల్స్, గంజాయిని మారేడ్పల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.