అనంతపురం అర్బన్: కల్లుమడి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడి వృద్ధుడికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | May 5, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సింగనమల మండలం కల్లుమడి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నల్లప్ప అనే వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.