కోడుమూరు: కోడుమూరు నియోజవర్గంలో 104 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేకి వినతిపత్రం
కోడుమూరు నియోజకవర్గంలో 104 అంబులెన్స్ ఉద్యోగులు తమ 14 ముఖ్య డిమాండ్లను స్థానిక ఎమ్మెల్యే దస్తగిరికి ఆదివారం వినతిపత్రం ద్వారా తెలియజేశారు. భవ్య హెల్త్ సర్వీసెస్ వేతన కోత, అరబిందో సంస్థ బకాయిల విడుదల, నూతన నియామక విధానాలు, రూ. 10 లక్షల బీమా, పిఎఫ్-ఇఎస్ఇ అమలు వంటి అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. సెప్టెంబర్ 25లోపు తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలను ముమ్మరం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.