ఒంగోలు అర్బన్: నిత్యం ప్రమాదాలు జరిగే సింగరాయకొండ ఎమర్జెన్సీ లాండింగ్ రహదారిని పరిశీలించిన కలెక్టర్ ఎస్పీ తదితరులు
Ongole Urban, Prakasam | Jul 1, 2026
సింగరాయకొండ వద్ద నున్న ఎన్ హెచ్ -16 ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డు పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, అధికారులను ఆదేశించారు. సింగరాయకొండ వద్ద నున్న ఎన్ హెచ్ -16 ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డు పరిధిలో ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు, సంబంధిత అధికారులతో కలసి సింగరాయకొండ వద్ద నున్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డు ను పరిశీలించి ఎన్హెచ్ఏఐ, రవాణా శాఖ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.