కర్నూలు: కర్నూలులో ఎస్ఎఫ్ఐ నిరసన – పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్
ఆదోని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని సుందరయ్య సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులపై పిడిగుద్దులు గుద్దుతూ, అసభ్య పదజాలంతో లాఠీ ఛార్జ్ చేయడం తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు ఆర్యన్ మాట్లాడుతూ… “గత ప్రభుత్వం ప్రారంభించిన ఆదోని మెడికల్ కళాశాల పనులు మధ్యలో ఆగిపోయాయి. వాటిని పూర్తిచేసి విద్యార్థులకు వైద్య విద్య అందించాలి. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం. దీంతో వేలాది మంది విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారు” అన్నారు.ఇప్పటికే 50