గూడూరు మండలం పెంచికలపాడు విశ్వభారతి ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం కె.శింగవరంకు చెందిన బాలింత వెంకటలక్ష్మి మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. తొలికాన్పు కోసం ఆసుపత్రిలో చేరిన వెంకటలక్ష్మికి డాక్టర్లు సిజేరియన్ ఆపరేషన్ చేయడంతో ఆడ శిశువును ప్రసవించింది. అయితే ప్రసవానంతరం బాలింత పరిస్థితి విషమించడంతో డాక్టర్లు మరోసారి ఆపరేషన్ నిర్వహించారని, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే వెంకటలక్ష్మి మృతి చెందిందని ఆరోపణలు చేసిన బంధువులు ఆస్పత్రిలో బైఠాయించారు