నగరి: జబర్దస్త్ కామెడీ షో ని మరిపించే విధంగా కేఏ పాల్ లేని లోటుని మాజీ సీఎం జగన్ తీరుస్తున్నారు: ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
కేఏ పాల్ లేని లోటును మాజీ సీఎం జగన్ తీరుస్తున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జబర్దస్త్ షోకు మించిన కామెడీ ఆయన ప్రెస్ మీట్లలో ఉంటుందన్నారు. గోల్డ్ మెడల్ వచ్చిన వ్యక్తి తప్పుగా అప్లికేషన్ ఫిల్ చేస్తే ఆయనకు జాబ్ రాలేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయనకు జాబ్ ఇచ్చేయండి అని చెప్పడం జాతిరత్నం సినిమాలో అడ్వకేట్ కారు నంబర్ను ఐపిసి సెక్షన్ గా చెప్పినట్లు ఉందని విమర్శించారు.