డోన్: బేతంచెర్ల మండలం లో వైసీపీకి షాక్,20కుటుంబాలు టిడిపిలో చేరిక
Dhone, Nandyal | Apr 10, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఎంబాయ్ గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. శుక్రవారం నాయకులు నాగ విజయప్ప, ఈశ్వరప్ప ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సమక్షంలో వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి సుజాతమ్మ టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. టీడీపీ అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తోందని, కార్యకర్తలకు అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.