నంద్యాలలో ప్రభుత్వ మూత్రశాలలను ఏర్పాటు చేయాలని బీజేపీ నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. నంద్యాలలో మూత్ర విసర్జన చేయడానికి పబ్లిక్ టాయిలెట్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు.