గుంతకల్లు: ఆలయాల పరిరక్షణకు పాటుపడాలి, గుంతకల్లు మండలం కసాపురంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి గుమ్మెళ్ల సత్యం
యువత ధార్మికంగా ముందుకు సాగుతూ ఆలయాల పరిరక్షణకు నడుం బిగించాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి గుమ్మెళ్ల సత్యం పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో ఆదివారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 16 జిల్లాల నుంచి ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి గుమ్మెళ్ల సత్యం వచ్చే ఆరు నెలల కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. బజరంగ్ దళ్ పాత్ర యువతను సమాజంలో ధార్మికంగా నడిపించే దిశగా ఉండాలని అన్నారు.