సత్యవేడు : శ్రీసిటీనీ సందర్శించిన జాగృతి యాత్ర బృందం
జాగృతి యాత్రా బృందానికి చెందిన 530 మంది సభ్యులు శుక్రవారం శ్రీసిటీ సందర్శించారు. ఔత్సాహక పారిశ్రామికవేత్తలను తయారుచేసే లక్ష్యంతో ముంబై కి చెందిన జాగృతి సేవా సంస్థాన్ స్వచ్చంద సంస్థ ఏటా చేపట్టే ఈ జాగృతి యాత్ర, ప్రత్యేక రైలు ప్రయాణం ద్వారా దేశమంతా పర్యటించి, వివిధ రంగాలలో ఆదర్శవంతులను (రోల్ మోడల్‌లు) కలుసుకుని వారితో సంభాషించడం ద్వారా యాత్రికులలో స్ఫూర్తి నింపుతుంది. శ్రీసిటీని సందర్శించిన బృందంలో అమెరికా, యూరోప్ కు చెందిన 13 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.