అనంతగిరి మండలంలోని బందకొండ గిరిజనుల రహదారి కష్టాలు తీర్చండి-వేడుకుంటున్న గిరిజనులు
అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధి బందకొండకి తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఇటీవల తాటిపల్లి నుంచి బందకొండ వరకు మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టారు. కురుస్తున్న అకాల వర్షాలకు ఉన్న మట్టిరోడ్డు కొట్టుకుపోయి పెద్ద పెద్ద బండరాయిలు జారిపడడంతో కనీసం బైకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నారు.