కోడుమూరు: ప్రధాని సభకు వస్తూ విద్యుదాఘాతంతో మృతి చెందిన అర్జున్ కుటుంబాన్ని పరామర్శించిన కేడిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని మునగలపాడు గ్రామానికి చెందిన కార్యకర్త అర్జున్ ప్రధాని సభకు వస్తూ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి సొంత నిధులు రూ . 5 లక్షల చెక్ అందించారు. మరో రూ. 20 వేలు అంత్యక్రియల నిమిత్తం అందించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.