కోడుమూరు: కోడుమూరులో పత్తి రైతుల సదస్సు సమ్మేళనం కరపత్రాలు విడుదల
కోడుమూరు సీపీఐ కార్యాలయం వద్ద గురువారం పత్తి రైతుల సదస్సు సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి రాజు మాట్లాడుతూ అధిక వర్షాల వలన నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈనెల 18, 19 తేదీల్లో పత్తి రైతుల సదస్సును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షుడు రాముడు, రైతులు పాల్గొన్నారు.