ప్రకాశం జిల్లా తర్లుపాడు రైల్వే స్టేషన్ పరిధిలో గరండాల వద్ద గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రైలు పట్టాల పక్కన మృతదేహం పడి ఉండడంతో గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు కొంత సమయం తర్వాత మృతుని పక్కన ఉన్న పాత గుడ్డలను గమనించిన స్థానికులు మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న కాశయ్యగా గుర్తించినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు రైలు తగిలి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.