ఒంగోలు అర్బన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సర్ పై కలెక్టరేట్లో సమీక్షా సమావేశం హాజరైన ఎన్నికల కమిషన్ అధికారులు
Ongole Urban, Prakasam | Jun 24, 2026
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ( సర్ ) నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించరాదని కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ ఏటూరి భాను ప్రకాష్ చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ కుమార్ లతో కలిసి బుధవారం ఆయన ఒంగోలు వచ్చారు. జిల్లాలో ' సర్ ' ప్రక్రియలో పురోగతిపై కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిలతో కలిసి ప్రకాశం భవనంలో వీరు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటైజేషన్ చేస్తున్న తీరు, పురోగతిపై ఆరా తీశారు. భాను ప్రకాష్ సర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు తెలియజేశారు