బనగానపల్లె: ఎస్ ఐ ఆర్ గడువు మూడు నెలలు పొడిగించాలంటూ బనగానపల్లె తాసిల్దార్ కు వినతి అందించిన సిపిఐ
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను మరో మూడు నెలల పాటు పొడిగించాలని కోరుతూ సీపీఐ బనగానపల్లె మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. బీఎల్ వోల నిర్లక్ష్యం, సాంకేతిక సమస్యలు, అవగాహన లోపం కారణంగా అర్హులైన పలువురు ఓటర్ల వివరాలు నమోదు కావడం లేదని, దీంతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.