కోడుమూరు: మునగాలపాడులో అర్జున్ కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందించిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కనిగిరి ఎమ్మెల్యే
ప్రధాని సభకు వస్తూ విద్యుదాఘాతంతో మృతి చెందిన అర్జున్ కుటుంబానికి శుక్రవారం కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి రూ .5 లక్షల చెక్కు అందించారు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మునగాలపాడు చేరుకుని మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అలాగే ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని ఎమ్మెల్యే పరామర్శించి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ. 10 వేలు అందించారు.