విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒంగోలులో సంబరాలు చేసిన దళిత సంఘాల నేతలు
Ongole Urban, Prakasam | May 10, 2026
తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఒంగోలు నగరంలోని పలు ప్రాంతాలలో దళిత సంఘాల నేతలు ఆదివారం సాయంత్రం బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేశారు. విజయ్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో సాగాలని పేదలు బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. విజయ్ ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేకుండా ఐదు సంవత్సరాలు పాటు సుపరిపాలన అందించాలని వారు ఆకాంక్షించారు ఒంగోలు నగరంలోని చర్చి సెంటర్ కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ మరియు తదితర ప్రాంతాలలో సంబరాలు చేసుకొని అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆనందం వ్యక్తం చేశారు