ఇచ్ఛాపురం: ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి: ఎంఈఓ శివరాం ప్రసాద్
కంచిలి మండలం, తలతంపర, శాసనం, కొన్నాయి పుట్టుక, అంపురము గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ కార్యక్రమం ఎంఈఓ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటే వజ్రాయుధమని, ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈపీఓఆర్డీ రాంబాబు, ఏఓ ధనుంజయ, బిఎల్వోలు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.