సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పాల్గొంటున్న సందర్భంగా భారీ బందోబస్తుతో ప్రత్యేక నిఘా
శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పాల్గొనేందుకు వస్తున్న సందర్భంగా పుట్టపర్తిలో పటిష్టమైన బొందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. నవంబర్ 19 వ తేదీన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 22, 23 వ తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ పుట్టపర్తిలో జరిగే శ్రీ భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న సందర్భంగా గత వారం రోజుల నుండి పుట్టపర్తి పరిసర ప్రాంతాలలో ప్రత్యేక పోలీస్ బృందాలు అణువణువు తనిఖీలు చేస్తుండడంతో పాటు, రాత్రి వేళల్లో నైట్ డ్రోన్లతో ప్రత్యేక నిఘా చేపట్టారు.