ఒంగోలు అర్బన్: ప్రకాశం జిల్లాలో నీటి సమస్యకు పరిష్కారం చూపిస్తామని జిల్లా కలెక్టర్ రాజాబాబు వెల్లడి
Ongole Urban, Prakasam | Apr 25, 2026
ప్రకాశం జిల్లాలో నీటి సమస్యకు పరిష్కారం చూపిస్తామని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. శుక్ర, శనివారం పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజాబాబు చండ్రపాడులో పర్యటించారు. పల్లెనిద్ర కార్యక్రమం అనంతరం ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. గ్రామంలో ప్రజలు నీటి సమస్య ఉందని చెప్పడం జరిగిందని నీటి సమస్య పరిష్కారానికి కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా చేపడతామని వెల్లడించారు.