ఒంగోలు అర్బన్: ఒంగోలులో తిరుమల తిరుపతి దేవస్థానంలో సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు మాజీ ఆర్మీ ఉద్యోగులను ఎంపిక
Ongole Urban, Prakasam | Jun 13, 2026
తిరుమల తిరుపతి దేవస్థానంలో సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థుల ఎంపికను ఒంగోలులో డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించారు. 50 సంవత్సరాలలోపు మాజీ సైనికులు ఈ పోస్టులకు అర్హులు కావడంతో జిల్లాకు చెందిన 20 మంది ఎంపిక ప్రక్రియకు హాజరయ్యారు. జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ రహీం, మేనేజర్ గోవర్ధన్ రావు పర్యవేక్షణలో పదిమందిని ఎంపిక చేశారు.