ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు
Ongole Urban, Prakasam | Jun 12, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో శుక్రవారం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా వైసిపి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి నిరసన ర్యాలీ చేపట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు వైఫల్యం చెందారని వైసీపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. జగనన్న హయంలో హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు వైసిపి నేతలు అన్నారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని 2029 ఎన్నికల తర్వాత వైసిపి ప్రభుత్వం ఏర్పడుతుందని వైసిపి నాయకులు అన్నారు.