ఓ మహిళ అదృశ్యమైన ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఐలాపూర్ గ్రామానికి చెందిన చిప్ప ఆయేషా ఫాతిమా (18) మంగళవారం మధ్యాహ్నం ఇంటి పక్క గల్లీలోని కిరాణా షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు వెతికినా ఆచూకీ దొరకలేదు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని తెలిపారు. తల్లి చిప్ప మౌలాని ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.