అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని రజాక్ ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 25, 2026
అనంతపురం నగర శివారులోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డులో ఉన్న రజాక్ ఫంక్షన్ హాల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.