వాలంటీర్ల వ్యవస్థ చాలా గొప్పదని పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి ఎడం బాలాజీ అన్నారు. రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేసిన సమయంలో ధైర్యంగా పనిచేసింది వాళ్ళేనని ఆయన కొనియాడారు. బాపట్ల జిల్లా, కారంచేడులో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా వైసిపి ఇంచార్జ్ బాలాజీ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాంటి వాలంటీర్లకు తన చేతులమీదుగా అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పథకాలు, వాలంటీర్ వ్యవస్థ రావాలంటే జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నారు.