వీపనగండ్ల: బొలెరో వాహనం ఢీకొని 2 సంవత్సరాల చిన్నారి మృతి
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పులకర చర్ల గ్రామంలో బులోరా వాహనం ఢీకొని లోహిత అనే చిన్నారి మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి శ్రీరంగాపురం నుంచి కల్వరాల వెళ్లే రోడ్డులో చిన్నారి లోహిత రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఒక్కసారిగా ఢీకొనడంతో లోహితకు తీవ్ర గాయాలు అవ్వడంతో తలకు ఎడమ చేతికి బాగా తగలడంతో చికిత్స కొరకు వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మార్గమధ్యలో చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు లోహిత తండ్రి గంగాధర్ నిర్లక్ష్యంగా అతివేగంతో వచ్చిన డ్రైవర్ రాముడు పై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు