మరోసారి హాస్టళ్లలోకి వెళ్తే మీపై కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తానంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని AISF నాయకుడు ఆకాశ్ ఆరోపించారు. కొందుర్గులో మాట్లాడుతూ కుల్కచర్ల మండలం బండ ఎలికిచర్ల వద్ద ఉన్న గురుకుల పాఠశాలలో సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేయడానికి వెళ్తే మీరు ఎమ్మెల్యేలా, మంత్రులా అని ప్రశ్నిస్తున్నారని, ప్రజాపాలన అంటే కేసులు పెట్టడమేనా అని ప్రశ్నించారు.