సత్తుపల్లి: కల్లూరు మండలంలోని ఎన్ఎస్పి కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లోని ఎన్ఎస్పి కాలువలో యువకుడు గల్లంతయిన రెండు రోజుల తరువాత మృతదేహం లభ్యం అయింది.లోకవరం గ్రామానికి చెందిన శివ అనే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఆదివారం సెలవు దినం కావడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఎన్ఎస్పి కాలువ వద్ద సెల్ఫీలు దిగేందుకు వెళ్లారు.ఫోన్లో సెల్ఫీలు దిగుతున్న క్రమంలో సంపత్ అనే యువకుడు ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయాడు.స్నేహితుడిని రక్షించేందుకు శివ వెంటనే కాలువలోకి దిగాడు.అయితే పక్కనే ఉన్న కొందరు రైతులు సంపత్ ను ఒడ్డుకు తీసుకురాగా శివ మాత్రం కాలువ లోని నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు.