నడిగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య: నడిగూడెం ఎంఈఓ ఉపేందర్ రావు
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎంఈఓ ఉపేందర్ రావు అన్నారు. శుక్రవారం నడిగూడెంలో బడిబాటపై గ్రామ సభ నిర్వహించారు. బడి ఈడు పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. చదువుల నాణ్యతలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలను ప్రభత్వ పాఠశాలల్లో చేర్పించి ఫీజుల భారం తగ్గించుకోవాలన్నారు.