పటాన్చెరు: రింగ్ రోడ్ ఎగ్జిట్ వరకు రేడియల్ రోడ్ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలి : MP రఘునందన్
లింగంపల్లి చౌరస్తా–అమీన్పూర్–సుల్తాన్పూర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వరకు రేడియల్ రోడ్ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని GHMC కమిషనర్ ఆర్.వీ. కర్ణన్తో కలిసి స్థలాన్ని మెదక్ MP రఘునందన్ రావు మంగళవారం పరిశీలించారు. వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని కోరగా కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే అమీన్పూర్, సుల్తాన్పూర్, బొల్లారం, శేరిలింగంపల్లి వాసులకు రింగ్ రోడ్ ప్రయాణం మరింత సులభతరం కానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.