మిడ్జిల్: మిడ్జిల్ మండలం కొత్తపల్లిలోఇసుక అక్రమ రవాణా జరుగుతోందని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో వంటా వార్పు
మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామంలో కొన్ని రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని గ్రామస్థులు ఆరోపించారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొనసాగిస్తున్న ధర్నా శుక్రవారంతో ఐదో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా వంటావార్పు కార్యక్రమాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, అఖిల పక్షం నాయకులు పాల్గొన్నారు.