డోన్: రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ల సాయంతో విద్యుత్ వైర్లు లాగిన డోన్ విద్యుత్ అధికారులు
Dhone, Nandyal | May 14, 2026 నంద్యాల జిల్లా డోన్ డోన్ మండలంలో డ్రోన్ల సాయంతో విద్యుత్ లైన్లు లాగే పనులను నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ డీఈ కమలాకర్ తెలిపారు గురువారం ఓబులాపురం దగ్గర పోల్ టు పోల్ 11 కేవీ వైర్లను డిఇ సమక్షంలో లాగారు. ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా నూతన టెక్నాలజీ వినియోగించి వైర్లను లాగుతున్నట్లు తెలిపారు. డ్రోన్ల సహాయంతో పనుల సమయం తగ్గడంతో పాటు, ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుందని తెలిపారు