రాయచోటిలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
విశ్వకర్మ జయంతి సందర్భంగా రాయచోటిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు విశ్వకర్మ చిత్ర పటానికి పూలమాల వేసి, అదనపు ఎస్పీ (పరిపాలన) వెంకటాద్రి పుష్పగుచ్ఛాలతో ఘన నివాళి అర్పించారు. అదనపు ఎస్పీ మాట్లాడుతూ, విశ్వకర్మ కేవలం దేవతల శిల్పి మాత్రమే కాక, కష్టపడి పనిచేసే ప్రతిఒక్కరికీ ఆదర్శమని, శిల్పకళ, ఇంజనీరింగ్, లోహకళ, వడ్రంగం వంటి వృత్తులలో సృజనాత్మకతకు ప్రేరణగా ఉంటారని పేర్కొన్నారు. విశ్వకర్మ సిద్ధాంతాలు ఆధునిక యుగంలోనూ అవసరమని, కష్టపడే తత్వం, పట్టుదల, నైపుణ్యంతో ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు.